ప్రతిష్టాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ పొందిన కిరణ్ అబ్బవరం “క” సినిమా
Kiran Abbavaram's film "Ka" has been nominated in the Best Film category at the 15th Dadaphalke Film Festival 2025.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ “క” ప్రతిష్టాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ తమ హ్యాపీనెస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. “క” సినిమాకు డెబ్యూ డైరెక్టర్స్ సుజీత్, సందీప్ రాసిన స్ట్రాంగ్ స్టోరీ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సరికొత్త బ్యాక్ డ్రాప్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
గతేడాది దీపావళికి రిలీజైన “క” సినిమా పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.



