మహేశ్వరం ఆస్పత్రికి కేఎల్ఆర్ చేయూత
మౌలిక వసతలు కల్పనకు సత్వర సహాయం
వైద్యసిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి.
వారం రోజులకు ఒకసారి దావాఖానా పరిశీలిస్తా: కేఎల్ఆర్.
KLR donated to the hospital
రంగారెడ్డి
వారం రోజులకు ఒకసారి మహేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తానని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ మహేశ్వరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పేదలకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయాలంటే కొన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆస్పత్రి వైద్యుడు సిద్దిక్ కోరారు. దీంతో స్పందించిన కేఎల్ఆర్… హస్పిటల్ కు అవసరమైన కనీస వసతులను వెంటనే తన ట్రస్ట్ ద్వారా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెజన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మెరుగైన పరికరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు కేఎల్ఆర్. అనంతరం రోగులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆధునీకరించిన వైద్య పరికరాలను పరిశీలించారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. దావాఖానాలో అన్ని వసతులు ఏర్పడి మంచి చికిత్సలు అందే వరకు వారంలో ఒకరోజు వస్తానని హామీ ఇచ్చారు. ఆస్పత్రి దగ్గర ఓ మహిళ తన పిల్లల చదువులు, ఇబ్బందులను కేఎల్ఆర్ కు వివరించటంతో ప్రైవేటు ఉద్యోగంతోపాటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని మానవత్వం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘుమారెడ్డి, బి. మల్లేష్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, కూన యాదయ్య, రాజు నాయక్, పాండ్ నాయక్, రాఘవేందర్ రెడ్డి, విఠల్ నాయక్, అల్లె కుమార్, డి శ్రీనివాస్ రెడ్డి, కే.రాములు, మహేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.