- Advertisement -
మానవ, బాలల హక్కుల చట్టాలపై అవగాహన
Knowledge of human and child rights lawsమైలవరం,
హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఎస్. లిల్లెమ్మ ఆధ్వర్యంలో మానవ హక్కులు, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కులు, అదేవిధంగా బాలల హక్కులపై ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో మానవులకు ఉన్న చట్టపరమైన హక్కులు ఏమిటి? అదేవిధంగా బాలలకు ఉన్న చట్టపరమైన హక్కులు ఏమిటి? అనే అంశాలపై లిల్లెమ్మ విద్యార్థిని విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.
- Advertisement -




