అమెరికాలోని శాన్ రామన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ ,అక్టోబర్ 19(వాయిస్ టుడే ప్రతినిధి)
Kodad MLA Padmavathi Reddy participated in Bathukamma celebrations in San Ramon, USA.

ఖండాంతరాలు దాటినా చెరగని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్ (San Ramon) నగరంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలమాద పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికా గడ్డపై తెలంగాణ ఆడపడుచులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఎక్కడ ఉన్నా మన సంస్కృతే మన గుర్తింపు… మన సంప్రదాయాలే మన ఆత్మగౌరవం!
తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ జరుపుకుంటూ మన సంస్కృతిని భావితరాలకు అందిస్తున్న తెలుగు ప్రజలకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.




