Wednesday, March 4, 2026

కోదాడ కోర్టు భవనం రాష్ట్రం లోనే మోడల్ గా నిలవాలి

- Advertisement -

కోదాడ కోర్టు భవనం రాష్ట్రం లోనే మోడల్ గా నిలవాలి

Kodada court building should stand as a model in the state :

కోర్టు భవన నిర్మాణ పనులు నాణ్యతగా పూర్తి చేయాలి
నూతన భవనం ఏర్పాటు తో కక్షి దారులకు, న్యాయ వాదులకు మెరుగైన సదుపాయాలు
సూర్యాపేట
కోదాడ లో నూతనంగా నిర్మించే కోర్టు భవనం రాష్ట్రం లోనే మోడల్ గా నిలవాలని కోదాడ జూనియర్ సివిల్ జడ్జీ  ఎన్. శ్యాంసుందర్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో 25 కోట్ల రూపాయల వ్యయం తో  4 అంతస్తుల్లో నిర్మిస్తున్న 4 కోర్టు భవన సముదాయముల నిర్మాణ పనులకు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య,  సెకండ్ క్లాస్ జడ్జి సత్యనారాయణ లతో కలిసి  శంకుస్థాపన చేసి మాట్లాడారు.భవన నిర్మాణ పనులను  నాణ్యత తో సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. కోర్టు నిర్మాణం తో కక్షిదారులు,  న్యాయవాదులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయన్నారు.గత కొన్నేళ్లుగా కక్షి దారులు న్యాయ వాదులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయన్నారు.భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల న్యాయ వాదులు ,కక్షీ దారులు ఆందోత్సవాలు వ్యక్తం చేశారు. ఈ  కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల. నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల. రామిరెడ్డి,సీనియర్ న్యాయవాదులు  చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి,ఎలకా. సుధాకర్ రెడ్డి, దేవ బత్తిని. నాగార్జున రావు,కేఎల్ఎన్. ప్రసాద్, తమ్మినేని. హనుమంతరావు, సిలివేరు. వెంకటేశ్వర్లు,ఈదుల. కృష్ణయ్య, మేకల. వెంకట్రావు, బొబ్బ. కోటిరెడ్డి, పాలేటి. నాగేశ్వరరావు, శరత్ బాబు ,రాజారాం, శ్రీదేవి బార్ అసోసియేషన్ సభ్యులు సరికొండ. హనుమంత రాజు, కోడూరు. వెంకటేశ్వరరావు, మంద. వెంకటేశ్వర్లు, హేమలత,దొడ్డ. శ్రీధర్,సామా. నవీన్ కుమార్, షేక్. నాగుల్ పాషా, ధనలక్ష్మి తదితర న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్