Sunday, September 8, 2024

కొడంగల్ 100 శాతం అభివృద్ధి చేస్తా

- Advertisement -

మహబూబ్ నగర్, నవంబర్ 22, (వాయిస్ టుడే):  కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, కోస్గి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారని ఆరోపించారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పార్టీల దృక్పథాన్ని చూడాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.15 సంవత్సరాలు పోరాడి టీఆర్ఎస్ తెలంగాణ సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. ఒకప్పుడు కొడంగలం వర్షం మీద ఆధారపడి ఉండేది.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవన్నారు. మరోవైపు.. రెండు వేల పెన్షన్ ను ఐదు వేలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కాగా.. రైతుబందు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని అన్నారు. రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు.. రైతు బందుకు డబ్బులు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్.. మూడు గంటల కరెంట్ చాలు అని.. రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని చెప్పుకొచ్చారు. 10 HP మోటార్ లు పెట్టాలి అంటే 50 వేల కోట్లు కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు అని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసేస్తాము అంటున్నారని.. భూమాత అని పేరు పెడతాము అంటున్నారని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బందు ఎలా వస్తదని ప్రశ్నించారు. వీఆర్ఏ, వీఆర్ఓలను తీసుకొస్తామని అంటున్నారు.. అది మనకు అవసరమా అని కేసీఆర్ అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదని చెప్పారు. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా.. ఫాలుతు మాటలు మాట్లాడే రేవంత్ కావాలా అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి అది తనకు మెడల్ అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ లో 15 మంది మోపయిర్రు.. నేను సీఎం అంటే నేను సీఎం అంటున్నారని చెప్పారు. నరేందర్ రెడ్డిని గెలిపియండి, ఆయనకు ప్రమోషన్ వస్తదని కేసీఆర్ అన్నారు.ఇంతకు ముందు మంచి నీటికి గోస ఉండేది, కానీ నేడు అది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కంటి వెలుగు అనేది దేశంలో ఎవరైనా చేశారా… మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి ఊడేదాక కొడతారు.. కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండని విమర్శనాస్త్రాలు సంధించారు. కొడంగల్ కు ఒకరోజు వచ్చి రోజంతా ఉంటా.. ఎన్ని కోట్లు అడిగినా నిధులు ఇస్తానని తెలిపారు.. కొడంగల్ అభివృద్ధి బాధ్యత తనది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాది లోపల పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీరు అందుతదని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్