వేములవాడ రాజన్నను దర్శించుకున్న: బండి సంజయ్
వేములవాడ:ఆగస్టు 26: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి ఈరోజు ఉదయం రాజన్న ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కు ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి బండి సంజయ్ కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బండి సంజయ్ ను చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
వేములాడ రాజన్నను దర్శించుకున్న వారిలో కర్నాటక, తమిళనాడు, యూపీ, అసోంకి చెందిన ఎమ్మెల్యేలు సీకే రామస్వామి, బస్వరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగురియాతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ తదితరులున్నారు….