మహమ్మాబాద్ లో కొండా ప్రచారం
వికారాబాద్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులు అందరికన్నా ముందుగానే ప్రచారం చేపట్టిన ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. యాత్రలో భాగంగా అయన పరిగి నియోజకవర్గం లోని మాహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మొహమ్మదాబాద్, కొలింపల్లి, కాచిన్ పల్లి, మొకర్లబాద్, చౌదర్ పల్లి, బోరింగ్ తండా గ్రామాల్లో యాత్ర నిర్వహించిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానికులతో ముచ్చటించారు. తాను లోక్సభ సభ్యుడిగా చేసిన అభివృద్ధిని గ్రామస్తులకు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తన గెలిపించడం ద్వారా నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటుందని ఆయన వివరించారు. బిజెపి పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి వారికి వివరించారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలువురు బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
===================
మహమ్మాబాద్ లో కొండా ప్రచారం
- Advertisement -
- Advertisement -