గౌరవ డాక్టరేట్ అవార్డు పొందిన ఉపాధ్యాయుడు కోట లక్ష్మణ్

- Advertisement -

గౌరవ డాక్టరేట్ అవార్డు పొందిన ఉపాధ్యాయుడు కోట లక్ష్మణ్

Kota Laxman, a teacher who was awarded an honorary doctorate

ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
మంథని
మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కోట లక్ష్మణ్  ఉపాధ్యాయ వృత్తిలో 20 సంవత్సరాలు చేసిన సేవకు గుర్తింపుగా, తెలుగు భాషలో,సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి చేయూతగా అమెరికా కు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందించడం పట్ల కాకర్లపల్లి గ్రామస్తులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా కోట లక్ష్మణ్ కు శుభాకాంక్షలు తెలిపి అయనను పాఠశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణి చేశారు. లక్ష్మన్  అంకిత భావంతో పని చేయడం వల్ల ఈ అవార్డు వరించిందని పలువురు పేర్కొన్నారు. పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ అదే విధంగా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తీర్చి దిద్ది.. పాఠశాల అభివృద్ధికి, గ్రామానికి మంచి పేరు ప్రాఖ్యతలు తీసుకురావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోష్ణ రాణి, గ్రామస్తులు బూడిద గణేష్, అల్లం కుమార్ స్వామి, మాదరబోయిన కిషన్ యాదవ్, బావు రవి లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular