గుడివాడలో మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పర్యటన…
ఐ లవ్ గుడివాడ సింబల్ వద్ద… విక్టరీ చూపిస్తూ హర్షం వ్యక్తం చేసిన మురళీమోహన్
కూటమి నాయకులతో ప్రజా వేదిక కార్యాలయంలో… భేటీ
కృష్ణాజిల్లా నీతివంతులకు, నిజాయితీపరులకు మారుపేరు:
మురళీమోహన్
గుడివాడకు రాము లాంటి మంచి అభ్యర్థి వచ్చారు..అందరి మన్ననలతో విజయం సాధించారు:
మురళీమోహన్
నీట్ లీకేజీని సరిదిద్దేందుకు ప్రధాని మోడీ సిద్ధం:
గొప్ప వ్యక్తి మురళీమోహన్ కు పద్మశ్రీ రావడం గర్వకారణం:
ఎమ్మెల్యే రాము
మురళీమోహన్ మా తరానికి ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి దాత:
ఎమ్మెల్యే రాము
Krishna District is synonymous with upright and honest people:
Murali Mohan
గుడివాడ జులై 25:
కృష్ణాజిల్లా అంటే నీతిమంతులు, నిజాయితీపరులైన నాయకులకు నిలయంగా ఉండేదని మాజీ పార్లమెంట్ సభ్యుడు పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. తెలుగుజాతికి రెండు కళ్ళు లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నడయాడిన గుడివాడ గడ్డ రావడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గుడివాడ పర్యటనలో భాగంగా ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికకు మాజీ పార్లమెంట్ సభ్యులు, పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ శనివారం విచ్చేశారు.
ముందుగా ఏజికే స్కూల్ సెంటర్లోని ఐ లవ్ గుడివాడ వద్ద ఎమ్మెల్యే రాముతో కలిసి ఫోటోలు దిగిన మురళీమోహన్…. విక్టరీ సింబల్ చూపిస్తూ ఐ లవ్ గుడివాడ అన్నారు. గుడివాడను ప్రేమించే రాము లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం మంచి విషయం అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రజావేదికను కూల్చివేయడంతో దానికి గుర్తుగా గుడివాడలో ప్రజావేదిక ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మురళీమోహన్ కు వివరించారు. నాటి విధ్వంసం, ఘోరాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము కార్యాలయంలో కూటమి నాయకులతో మురళీమోహన్ కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు మురళీమోహన్ తో ఫోటోలు దిగి పలకరించారు. జనసేన యువతతో మాట్లాడుతూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, గుడివాడలో మీకు ఎమ్మెల్యే రాము అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావడానికి కృషి చేయాలని వారికి సూచించారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ…
కృష్ణా జిల్లా నీతివంతులు, నిజాయితీపరులు, స్వచ్ఛమైన రాజకీయ నాయకులకు మారుపేరని, సొంత డబ్బు ఖర్చు చేసే పిన్నమనేని కోటేశ్వరరావు లాంటి నాయకులు ఎందరో ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో ముఖ్యమైనదని, గుడివాడలో ఎవరు గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో గెలుస్తుందనే నానుడి ఉందని తెలిపారు. అలాంటి నియోజకవర్గానికి మంచి అభ్యర్థిని పార్టీ ఎంపిక చేస్తుందని అందరూ ఎదురుచూశామని, ఆ ప్రయత్నంలోనే ఎన్నారై అయిన రాము లాంటి మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చిందని అన్నారు. టికెట్ ఇవ్వగానే తాను ఫోన్ చేసి అభినందించానని, ప్రెస్టేజ్ సీటు గెలవాలని శుభాకాంక్షలు చెప్పానని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన రాము అందరి మన్ననలతో గెలిచారని కొనియాడారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ నడయాడిన గుడివాడకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
నీట్ పేపర్ లీకేజీపై స్పందిస్తూ విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు అందరం ఖండించాల్సిందేనని అన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు పేపర్ లీక్ వల్ల నష్టపోవడం దారుణమని పేర్కొన్నారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయన వీడియో సందేశం ద్వారా ఇప్పటికే తెలిపారని వివరించారు. పార్లమెంట్ లో కఠిన చట్టాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయం చేయడం సరికాదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. రాజకీయ ఉచ్చులో పడితే విద్యార్థులే నష్టపోతారని హెచ్చరించారు.
రాజకీయాల్లో బిజీగా ఉండటంతో జయభేరి బ్యానర్ పై సినిమాలు చేయడం లేదని, అయితే ఇప్పుడు ట్రెండ్, సినిమాలు తీసే పద్ధతులు మారిపోయాయని తెలిపారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషకరమని, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందరో రాజకీయ ఉద్దండులకు కృష్ణాజిల్లా నిలయమని ముగించారు.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ
చంద్రబాబు వచ్చిన అయిదు రోజుల తర్వాత ఆంధ్రులు అభిమానించే మురళీమోహన్ గుడివాడ రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు పద్మశ్రీ రావడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు.
చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసిన మహనీయుడు మురళీమోహన్ అని, నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ, వ్యాపార, నిర్మాణ రంగాల్లో సక్సెస్ అయ్యారని కొనియాడారు. మురళీమోహన్ తమ అందరికీ ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి దాత అని ఎమ్మెల్యే రాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టిడిపి నాయకులు లింగం ప్రసాద్, పిన్నమనేని బాబ్జి, చేకూరు జగన్ మోహన్ రావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




