Monday, January 26, 2026

కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి

- Advertisement -

కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి

KTR don't have wrong behavior

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్
రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు. చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలని అన్నారు. కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్, నేను కొట్లాడాము.  అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. సమస్యను నేను డైవర్ట్ చేయడం లేదు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్ కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు లో కాంగ్రెస్ – బీఆర్ఎస్  కాంప్రమైజ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులన్నీ హంగామా చేసి చివరకు కాంగ్రెస్ – బీఆర్ఎస్  కాంప్రమైజ్ అవుతున్నారు. బీజేపీకి స్పేస్ లేకుండా  చేయాలని కాంగ్రెస్ – బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తె వాళ్ళు లీడర్ అవుతారా ?  బీఆర్ఎస్  ఇప్పుడు లేదుఇక ముందు ఉండదు. ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్  క్యాడర్ లేదు,కెపాసిటీ లేదు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.
బీఆర్ఎస్ నేత కేసీఆర్ రెస్ట్ లో ఉన్నారు కేసీఆర్ కొడుకు యాక్టింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్  కి అభ్యర్థులు దొరకడం లేదు. అభ్యర్థులు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. సర్పంచ్ ల పొట్టగొట్టిందే బీఆర్ఎస్  సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నారు. సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు.
బీఆర్ఎస్  లో కెసిఅర్ కొడుకును ఎవరు పట్టించుకోవడం లేదు. కెసిఅర్ కొడుకు అహంకారం తల నుంచి కిందకు దించుతా. కెసిఅర్ కొడుకుకు కళ్ళు నెత్తికి ఎక్కాయి. బీఆర్ఎస్ లో క్రిడిబులిటీ ఉన్న లీడర్ హరీష్ రావు.  ప్రధానిపై ఇష్టరీతిగా మాట్లాడితే సహించేది లేదు. టివిలో, ట్విట్టర్లో తప్ప కేటీఆర్ ఎక్కడ కనిపించడం లేదు.సోషల్ మీడియాలో రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని ప్రచారం చేసే ప్రయత్నం బీఆరెస్ చేస్తుంది. నేను రేవంత్ ఒక్కటే అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పండని అన్నారు.
గతంలో కెసిఅర్ గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వలేదు.  గవర్నర్ ఖమ్మం వెళ్తానంటే కనీసం హెలికాప్టర్ ఇవ్వలేదు. రేవంత్ గుర్తుపెట్టుకో ! నీ బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు.   నిన్ను జైలుకు పంపించారు.జైలుకు పంపించిన వారితో కాంప్రమైజ్ అవుతున్నారా?రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్