నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
KTR got relief in the High Court
హైదరాబాద్
కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.జువ్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జన్వాడ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చి వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న కేటీఆర్ తరుపున ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.లీగల్ స్టేటస్ ఏంటి? దీనిపై విచారణ జరిగింది. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కో రారు. ఇటీవల హైడ్రా నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హైడ్రా విధివిధానాలేంటి అని ప్రభుత్వ తరుపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ను వివరిస్తానని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో నేటి వరకూ నిర్మాణాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది.