- Advertisement -
గిరిజన రైతుకు బేడీలు వేయడంనై కేటీఆర్ ఆవేదన
KTR is concerned about giving bedis to tribal farmers
సచివాలయం
లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసిన అంశంపైన బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గిరిజన రైతు బిడ్డ హీర్యా నాయక్ కు బేడీలు వేయడంపైన కెటిఅర్ తీవ్ర అగ్రహం, అవేదన వ్యక్తం చేసారు. గుండె నొప్పి వచ్చిన రైతన్నకు బేడీలు వేయడం అమానావీయం, రేవంత్ కూృర మనసత్వానికి నిదర్శనం. జైలులో ఉన్న రైతు బిడ్డ హీర్యా నాయక్ కి నిన్న గుండెల్లో నొప్పి వస్తే… వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అససత్వం చూపిందని అన్నారు.
ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఆసుపత్రికి తరలియకుండా… తగిన చికిత్స అందించకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఈరోజు ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చింది… సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు… ఇప్పుడు మేము ఒత్తిడి తేవడంతో హైదరాబాద్ కి తరలిస్తామని చెప్తున్నారు.. వారితోపాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది.. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గుండెపోటు వచ్చిన రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకువచ్చింది ప్రభుత్వం. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదు. రాజ్యాంగం లోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే. నూతన క్రిమినల్ చట్టం బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని అన్నారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ ఈ అంశం లోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి జైపూర్లో విందులు వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారు. కానీ తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే తమ ప్రభుత్వానికి కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి చేతకాకుంటే వారందరికీ అవసరమైన వైద్య సహకారాన్ని, సహాయన్ని మా పార్టీ తరఫున అందిస్తాం. మా సామ్రాజ్యంలోకి మేము చెప్పిందే నడవాలని అహంకారంతోనే, రేవంత్ రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతన్నల ప్రాణాలు తీస్తున్నారు. కేవలం నా మాట వినలేదు అన్న ఏకైక కారణంతోనే వారి పైన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాని విమర్శించారు.
- Advertisement -