Thursday, January 15, 2026

 హెచ్ సీఏ వివాదంలో కేటీఆర్, కవిత

- Advertisement -

 హెచ్ సీఏ వివాదంలో కేటీఆర్, కవిత
హైదరాబాద్, జూలై 17, (వాయిస్ టుడే)

KTR, Kavitha in HCA controversy

దరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా తాజాగా సీఐడీ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఆరు రోజుల పాటు సీఐడీ వారిని విచారించనుంది. ఈక్రమంలో సీఐడీ అధికారులు వారిని చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహ్ రావు, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీ రాజేందర్‌ యాదవ్‌, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత యాదవ్‌, హెచ్‌సీఏ సీఈవో సునీల్‌, హెచ్‌సీఏ ట్రెజరర్‌ శ్రీనివాసరావులను సీఐడీ విచారించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ).. సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..హెచ్‌సీఏ ఎన్నికల్లోకి ఉన్నట్లుండి జగన్‌మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవితల హస్తం ఉందని ఆరోపిస్తూ.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గురువారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీసీఏ అధికారులు నేడు అడిషనల్ డీజ చారు సిన్హాను కలిశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు గెలిచిన వెంటనే తన విజయాన్ని కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తూ, కవిత, కేటీఆర్‌తో పాటు హెచ్‌సీఏలోని కొందరు అక్రమార్కులపై దర్యాప్తు చేయాలని కోరారు. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి దాదాపు రూ.500-600 కోట్ల నిధులు వచ్చినా, క్రికెట్ అభివృద్ధికి సంబంధించిన పనులు జరగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు భారీగా నిధులు వచ్చినా.. హైదరాబాద్‌లో మాత్రం క్రికెట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అలానే హైదరాబాద్‌లో క్రికెట్ కోసం ఎలాంటి కొత్త ఆస్తులు కొనలేదని తెలిపారు. పైగా ఉన్న వాటిని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.. గత 10 ఏళ్లలో హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్ల ఆస్తులు మాత్రం బాగా పెరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిని బట్టి హెచ్‌సీఐఏలో అవినీతి జరిగిందని స్పష్టంగా అర్థం అవుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం అవినీతి బాగోతంపై సీఐడీ ఫోకస్‌ పెట్టింది. కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.హెచ్‌సీఏ వివాదంలో ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జులై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతించి సంగతి తెలిసిందే. అలానే దర్యాప్తు వేగవంతం కావాలని సూచించింది. నిందితులను గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు.
సిఐడీ కస్టడీకి నిందితులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.హెచ్‌సీఏ కేసులో ఐదుగురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనుంది సీఐడీ. నిందితులను ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ క్లబ్స్‌లో అవకతవకలు, గత హెచ్‌సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది సీఐడీ. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, హెచ్‌సీఏ సీఈవో సునీల్‌, హెచ్‌సీఏ ట్రెజరర్‌ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీ రాజేందర్‌యాదవ్‌, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత యాదవ్‌ను విచారించనుంది సీఐడీ. ఈ ఐదుగురు నిందితుల బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసిన మల్కాజ్‌గిరి కోర్టు… ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్‌గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు, దర్యాప్తు వేగవంతం కావాలని సూచించింది. నిందితులను గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు.ఇప్పటికే నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచ‌క్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. న‌కిలీ ప‌త్రాల‌తో ఏర్పాటు చేసిన క్ల‌బ్ ద్వారానే HCAలో అధ్యక్షుడిగా పోటీ చేసిన‌ట్టు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాద‌వ్ సంత‌కాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రావు ఫోర్జ‌రీ చేసిన‌ట్టు సీఐడీ గుర్తించింది. దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం హెచ్‌సీఏ… ఇప్పుడు అవినీతికి కేరాప్‌గా మారింది. అక్కడ జరుగుతున్న ఆటంతా అవినీతి ఇన్నింగ్సే. సొమ్మును తెగతినడంలో ఆరితేరిపోయారు. బీసీసీఐ నుంచి అప్పనంగా వచ్చిపడుతున్న కోట్లు… హెచ్‌సీఏ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయ్‌ తప్ప ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయ్. ఈ మొత్తం అవినీతిపై సీఐడీ ఫోకస్‌ పెట్టింది. కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు తెలస్తోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్