పోలీసుల వ్యవహార శైలి పైన డిజిపిని మరోసారి ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్
KTR questioned the DGP once again
ట్రాఫిక్ పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది పోలీస్ శాఖకు, డిజిపికి అంగీకారయోగ్యమైన బాషనా అని ప్రశ్నించారు. పోలీసులకు ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చింది. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్నా పోలీసులు స్పందించడం లేదని అన్నారు.
ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డిజిపికి సూచించారు.