- Advertisement -
పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్
KTR said that it is the culmination of the insecurity of the rulers
హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది.. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన. అయితే అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేయడంతో స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహారెడ్డి. భార్య భుజం తట్టి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్.డిసెంబర్ 4, రాత్రి 9గంటలకు హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. గేట్ దగ్గరకు జనాలు చొచ్చుకురావడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇంకా చికిత్స పొందుతున్నారు.
- Advertisement -