- Advertisement -
కేసును కేటీఆర్ ఫేస్ చేయాలి
KTR should face the case
బాన్సువాడ
బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు. కేసును కేటీఆర్ ఫేస్ చేయాలి. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, హాజరు కావాలి. బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని అన్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది. అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణను ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు.
రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ పాలకులు చేయని అప్పులను చేశారు. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. అసలు, వడ్డీ కలిపి నెలకు రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ , సచివాలయం లోనికి పోలేని పరిస్థితులు ఉండేవి. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా మంత్రులను, అధికారులను కలుస్తున్నారని అన్నారు.
- Advertisement -