Sunday, January 12, 2025

కేటీఆర్ వర్సెస్  బండి

- Advertisement -
ktr-chit-chat-with-media
KTR vs. Bandi

హైదరాబాద్, జనవరి 27,
పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీఆర్ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాపై కాన్సంట్రేట్ చేసింది. అందుకోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో దిశానిర్దేశం చేసిన కేటీఆర్.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ను ఎలా టార్గెట్ చేయాలో హితబోధ చేశారు. వెయ్యి అబద్ధాలు చెప్పైనా, ఓ పెళ్లి చేయాలన్న సామెత తరహాలో.. దేశంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ అబద్ధాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి సీఎం, పీఎం అయ్యారన్నారు. అలాంటివాటిని తిప్పికొట్టడమే మన ప్రధానోద్ధేశ్యం కావాలంటూ పిలుపునిచ్చారు.అయితే, ఇదే సమావేశం వేదికగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రులను.. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీని, ప్రధాని మోదీని.. ప్రస్తుత సిట్టింగ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను తూర్పారబట్టారు. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ మళ్లీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. బీజేపీపై, తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎంపీ బండి సంజయ్ కౌంటర్ అటాక్ మొదలెట్టారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారాయి.రేపేం వారం.. ఎల్లుండేం వారం.. ఆవలెల్లుండేం వారం ఇవ్వడిగేందుకా ఇక్కడి ఎంపీని గెలిపించిందంటూ బండి సంజయ్‌పై సెటైర్స్ వేశారు కేటీఆర్. అసలు బొట్టు పెట్టుకోవడం, గుళ్లల్లోకి పోవడం ఇవన్నీ మనం బీజేపీ నుంచే నేర్చుకున్నట్టు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి రాజకీయం చేస్తే, బీజేపీ దేవుళ్లతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వినోద్ ఎంపీగా పార్లమెంట్ లో 550 ప్రశ్నలడిగితే.. సంజయ్ అడిగింది కేవలం యాభై ఏడేనన్నారు. అభివృద్ధి చేయని సంజయ్ కావాలా… చదువుకున్నోడైన వినోద్ కావాలా అంటూ సంజయ్ ను లైట్ గా తీసిపారేసే యత్నం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని మరో ఏక్ నాథ్ షిండేను చేయబోతోందని సంచలన ఆరోపణలు చేశారు. తానే ఓ గొప్ప హిందువనని చెప్పుకునే బండి సంజయ్ ఒక్క బడి కట్టలేదన్నారు. కనీసం గుడి కూడా కట్టలేదని, పైగా బిల్డప్పులు మాత్రం ఇస్తుంటాడంటూ ఎద్దేవా చేశారు. కొత్తపల్లి – మనోహరాబాద్ – సిద్ధిపేట దాటి ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయారో సంజయ్ చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే వినోదన్న వస్తాడు.. నువ్వూ రా.. అభివృద్ధిపై ఎక్కడ చర్చకంటే అక్కడ సిద్ధమంటూ సవాల్ విసిరారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టేలా సోషల్ మీడియా ఫైట్ ఉండాలని వారియర్స్‌కు దిశానిర్ధేశం చేశారు కేటీఆర్కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఇంకేం బండి సంజయ్ వెనువెంటనే తానూ మీడియా ముందుకొచ్చాడు. దీంతో కరీంనగర్‌లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వాతావారణం హాట్ హాట్‌గా మారింది.నువ్వో ప్యారాచూట్ లీడర్‌వి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టుగా.. ఇక్కడ అధికారం చెలాయిద్దామని చూశావ్. నీకంత సీన్ లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు బండి సంజయ్. గ్రౌండ్ నుంచి ఎదిగిన లీడర్ ని అంటూ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు సంజయ్. అధికారం కోల్పోయినా.. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా కేటీఆర్ లో ఇంకా అహంకారం మాత్రం పోలేదంటూ చురకలు అంటించారు. పదేళ్లు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేశారని.. ఇప్పటికీ ఇంకా తన తండ్రే ముఖ్యమంత్రనుకుంటూ ట్విట్టర్ టిల్లు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ది కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో ప్లేస్ అంటూ జోస్యం చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ టిప్పర్ లోడ్ లేఖలు రాయడం తప్పా.. తాను ఎంపీగా ఉన్నప్పుడు తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు సంజయ్కరీంనగర్- వరంగల్ రోడ్డు తెచ్చింది. అందుకోసం నలభై కోట్లు తీసుకొచ్చింది తాను కాదా అని ప్రశ్నించారు. శాతవాహన యూనివర్సిటీకి 12 బీ గుర్తింపు తీసుకొచ్చింది వినోదా.. సంజయా అనేది కేటీఆర్ చెప్పాలన్నారు. పార్లమెంట్ లో ప్రశ్నలడిగే విషయం మాట్లాడుతున్న కేటీఆర్.. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంటుకు వెళ్ళారో ముందు చెప్పాలన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీకి నిధులు కేటాయిస్తే, వాటిని రాష్ట్రం దారి మళ్లిస్తే.. వినోద్ అనే మేధావి నాడు ఎంపీగా ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. యాదగిరి గుట్ట వంటి పుణ్యక్షేత్రాన్ని వాణిజ్యకేంద్రంగా మార్చారంటూ తూర్పారబట్టారు. వేములవాడ, కొండగట్టు అభివృద్ధి.. ఇస్తామన్న నిధులేమయ్యాయని ప్రశ్నించారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకుతోనే భ్రష్ఠు పట్టిందంటూ ఫైరయ్యారు బండి. అంతేకాదు భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు రమ్మంటావా.. వేములవాడ, కొండగట్టు దగ్గరకు రమ్మంటావా.. నేను రెడీ అంటూ కేటీఆర్ సవాల్‌ను స్వీకరించారు బండి సంజయ్. తనపై దొంగ వీడియోలు సృష్టిస్తే.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు బండి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్