- Advertisement -
ఎంజీ యూనివర్సీటీ విద్యార్దులతో కేటీఆర్
KTR with MG University students
నల్లగొండ
ఎంజి యూనివర్సిటీ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటయింది. యూనివర్సిటీ విద్యార్థులు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేసారు. యూనివర్సిటీ ఉద్యోగులు, , ప్రొఫెసర్ తప్ప ఎవరిని లోపటికి మరియు బయటికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ సమస్యలను కేటీఆర్ దృష్టికి విద్యార్థులు తెచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మరోరోసారి యూనివర్సిటీకి వస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.. అయనను యూనివర్సిటీ లోపలికి రావాలని విద్యార్థులు కోరారు. లోపలికి వస్తే మీపై కేసులు పెడతారని కేటీఆర్ అన్నారు.
- Advertisement -