ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా మహాసభలు జయప్రదం చేయండి
Kudos to AIIF Kurnool District Mahasabhas
దేవనకొండలో మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
దేవనకొండ
ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా 16వ మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి సి. రమేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు బి. రవికుమార్, రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నారు. స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ నందు ప్రారంభం కాబోతున్న నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి చూపించాలన్నారు. వెంటనే డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్ వన్, టు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని సమరశీల పోరాటాలు కొనసాగించడానికి డిసెంబర్ 30,31 తేదీన కర్నూల్ నగరంలో జరిగే ఏఐవైఎఫ్ 16వ జిల్లా మహాసభలు చర్చావేదిక కానున్నాయన్నారు. ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు రాహుల్, నరేష్, మహబూబ్బాషా, భాస్కర్, నరసింహులు, అశోక్, రమేష్, మద్దిలేటి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.