- Advertisement -
“లక్ష దీపార్చన మహోత్సవం”
"Lakh Deeparchana Festival"
గోదావరిఖని
స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ మార్కండేయ శివాలయములో కార్తీక మాసం సంధర్బముగా శ్రీ మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల బిక్షపతి అద్వైర్యములో నిర్వహిస్తున్న “లక్షదీపార్చన మహోత్సవం ” కార్యక్రమములో భాగంగా తొలి రోజు మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇరవై వేల దీపాలను వెలిగించినారు . శివాలయ ఆచార్యులు రాఘవచార్యులు “లక్షదీపార్చన” విశిష్టతను వివరించి, భోళాశంకరుడిని పాల్గొన్న మహిళా భక్తిలచే పంచామృతలతో అభిషేకింపచేసి , వివిధ పూలతో ఆలంకరించి, నక్షత్ర హరతి తో స్వామి వారిని ఆరాధించినారు . తదుపరి సుతారి వాణి, ఉండవేనా కమల, బండారి అనూష , రావుల రాణి , మేతి మాలతి చే ‘జ్యోతిప్రజ్వలన’ గావించి పిదప మహిళాభక్తులు ఇరవై వేల దీపాలను వెలిగించినారు. ఇట్టి కార్యక్రమములో ఉత్సవ కమిటీ వారు అమ్మవారి కానుకగా తోట సంధ్యారాణి మరియు ఆకుల రాధా కు చీరలను బహుకరించినారు. ఇట్టి కార్యక్రమములో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు , కోశాధికారి గడ్డం రవి గౌడ్ , ముఖ్య సలహదారు కొండి లక్ష్మిపతి, సభ్యులు తాటిపాముల రాజెశ్, లెంకల రాజిరెడ్డి, తోకల మల్లయ్య, బొయినా కొమురయ్య ,దిడ్డి ఎల్లయ్య చిలక శ్రీనివాస్ ,వీరారెడ్డి ,రాపెల్లి సాంబమూర్తి ,సిరిపురం రమేశ్ మాటేటి సతిష్, బొద్దుల వేణు, దారా
శ్రీనివాస్, ఆడెపు రాజమౌళి మరియు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేసినారు
- Advertisement -