Sunday, September 8, 2024

భూవివాదం కేసు… న్యాయవాది  హత్య

- Advertisement -

రాజీకి అని పిలిచి చంపేశారు

గుంటూరు, జూలై 29, (వాయిస్ టుడే):  బాపట్లజిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ఈనెల 26వ తేది అదృశ్యమైన న్యాయవాది విఠల్‌బాబు మృతదేహం లభ్యమైంది. సుబాబుల్ తోటలో విఠల్‌బాబును చంపి పూడ్చిపెట్టారు ప్రత్యర్ధులు.. భూవివాదం కేసులో రాజీ చేసుకుందామని పిలిపించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. బాపట్లజిల్లా కొణిదెన గ్రామానికి చెందిన విఠల్‌బాబు విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బాపట్ల జి బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన విఠల్‌బాబు విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అద్దంకి కోర్టులో తన స్వంత భూమి విషయంలో వాయిదా ఉండటంతో ఈనెల 26న కోర్టుకు వచ్చఅదేరోజు సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. దీంతో విఠల్‌బాబు బంధువులు అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భూవివాదం కేంద్రంగా దర్యాప్తు చేపట్టారు.ఈ దర్యాప్తులో భాగంగా విఠల్‌బాబుతో భూమి వివాదం ఉన్న ప్రత్యర్దులు హత్య చేసినట్టు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులోని సుబాబుల్ తోటల్లో విఠల్‌బాబును చంపి పూడ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. కొణిదెన గ్రామానికి చెందిన విఠల్ బాబు న్యాయవాదిగా పనిచేస్తూ విజయవాడలో నివసిస్తున్నాడు. ఆయన స్వగ్రామం కొణిదెనలోని పొలాలకు సంబంధించి ఇతరులు ఆక్రమించుకొని దొంగ డాక్యుమెంట్లు పుట్టించి అమ్ముకున్నాంటూ అద్దంకి కోర్టులో విఠల్ బాబు ప్రత్యర్థులపై దావా వేశాడు.ఈ క్రమంలోనే ఈనెల 26వ తేదీన విఠల్ బాబును రాజి చేసుకుందామని నమ్మించి విఠల్‌బాబును బైక్‌పై ఎక్కించుకొని అద్దంకి కోర్టు నుండి బొమ్మనంపాడు రోడ్డులోకి తీసుకువెళ్లారు. అక్కడ విఠల్ బాబును చంపి పూడ్చి వేశారు. 26వ తేదీ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో విఠల్ బాబు కుటుంబీకులు సెల్ఫోన్ కు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూవివాదం కేసులో విఠల్‌బాబు ప్రత్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో ప్రత్యర్దులు రాజీ చేసుకుందామని తీసుకెళ్ళి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. న్యాయవాది విఠల్‌బాబును చంపి బొమ్మనంపాడు పొలాల్లో పూడ్చి వేశామని నిందితులు పోలీసుల ముందు ఒప్పకున్నారు. అద్దంకి తాసిల్దార్ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చామని చీరాల డిఎస్‌పి ప్రసాదరావు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్