- Advertisement -
లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలి
హైదరాబాద్
సికింద్రాబాద్ (లష్కర్) జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకత గురించి మంత్రికి విన్నవించారు. జిల్లా ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బాల రాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, శ్రీకాంత్ రెడ్డి, రవీందర్ సాగర్, సునీల్ తదితరులు ఉన్నారు.
- Advertisement -