టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు
హైదరాబాద్ మార్చ్ 1
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు. కారును ఢీకొన్న టిప్పర్‌ను పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. టిప్పర్‌ను సీజ్‌చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.గతనెల 23న పటాన్‌చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని అదుపు తప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. దీంతో వాహనం ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్ (26) తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత ఘటనా స్థలంలోనే మృతిచెందిన విషయం తెలిసిందే.
టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతి

- Advertisement -
- Advertisement -