Sunday, September 8, 2024

గచ్చిబౌలి లో 25 ఏసి ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం

- Advertisement -

హైదరాబాద్:  బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలో 25 ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసి ఎండీ సజ్జనర్ ప్రారంభించారు. ఇవి వేవ్ రాక్, బాచూపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జెబియేస్, హైటెక్ సిటీ, ఎల్బి నగర్ మధ్య నడవనున్నాయి. వీటిలో సీసీ కెమెరాలు, ప్రయాణికులకు చార్జింగ్ సదుపాయం లాంటి సౌకర్యాలు వుంటాయి.

Launch of 25 AC electric buses in Gachibowli
Launch of 25 AC electric buses in Gachibowli

ఆర్టీసి ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో  నడుపుతామని అన్నారు.

Launch of 25 AC electric buses in Gachibowli
Launch of 25 AC electric buses in Gachibowli

మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యము లేకుండా అందించాలి. ఎంత కష్టాల్లో  ఆర్టీసీ వున్నా,  ప్రయాణికులకు సంక్షేమం ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నారు. వచ్చే కొన్ని బస్సులు ఏసి లేని బస్సులు వస్తున్నాయి వాటిని కూడా ఏసి గా మార్చి నడిపించాలి. ఐటీ కారిడార్ లోనే కాదు, కొకపేట ఏల్బి నగర్ తో హైదరబాద్ చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాల నుంచి నడపాలి. మెట్రో వీటిని అనుసంధానం చేయాలి. అన్ని వైపుల ఇవే నడపాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు. కేంద్రం నుంచి సబ్సిడీ గతంలో వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా తీసేసింది కేంద్రం. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో UV పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్