ఆసిఫాబాద్ జిల్లాలో మున్నూరు కాపు పటేల్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ

- Advertisement -

ఆసిఫాబాద్ జిల్లాలో మున్నూరు కాపు పటేల్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ

కుటుంబ సభ్యత్వ నమోదు ద్వారా మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొస్తాం

తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్

Launch of the Munnuru Kapu Patels website in Asifabad district.

Launch of the Munnuru Kapu Patels website in Asifabad district.
Launch of the Munnuru Kapu Patels website in Asifabad district.

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 (వాయిస్ టుడే): తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ తెలిపారు.

శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో, అలాగే ఆసిఫాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్‌తో కలిసి వెబ్‌సైట్ బ్రోచర్‌ను డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్నూరు కాపు కుటుంబాల వివరాలను నమోదు చేయడం ద్వారా సంఘాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు కుటుంబాల మధ్య సమన్వయం, ఐక్యతను పెంపొందించేందుకు వెబ్‌సైట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం సభ్యత్వం నమోదు చేసుకుని సంఘం కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నూతన కార్యవర్గ సభ్యులకు పదవులు

అనంతరం నూతన పదవులు పొందిన ఆసిఫాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు గాజుల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదారి సాయి (గోలేటి), జిల్లా యూత్ సలహాదారు జపతి రమేశ్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రవి, వైస్ ప్రెసిడెంట్ పేరుక మహేష్, కాగజ్‌నగర్ మండల యూత్ అధ్యక్షుడు పార్వతి సురేష్, ఉపాధ్యక్షుడు డెక్కపురి గోపాల్, పట్టణ అధ్యక్షుడు చిట్టంపల్లి అనిల్, ప్రధాన కార్యదర్శి పూదారి సాయి, కోశాధికారి పుల్లిశెట్టి వెంకటేష్‌లకు పదవులు అందజేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమ శేఖర్, రాష్ట్ర నాయకులు కసా రాజు పటేల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుందరపు శంకరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిశెట్టి సదాశివ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందూరి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లిశెట్టి మహేష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వోడ్నాల ప్రసాద్, అడ్వల పెంటన్న పాల్గొన్నారు.

అలాగే సిర్పూర్ తాలూకా మహిళా అధ్యక్షురాలు బొలిశెట్టి అరుణ, సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి, ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు డేగలా సత్యనారాయణతో పాటు ఆసిఫాబాద్ పట్టణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు కులస్తులు దెబ్బటి శ్రీనివాస్, వోడ్నల సురేందర్, ఏళ్లకుల వెంకటేష్, ధరణి రామయ్య, సుంకరి వెంకన్న, నాయకిని లక్ష్మణ్, డెక్కపురి వంశీ, జెట్టి మల్లేష్ (దర్గోపల్లి), బండి వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular