- Advertisement -
హాజరైన తీన్మార్ మల్లన్న
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ గురువారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా హయత్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి మధుయాష్కి గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరలివచ్చారు. నేతలతో కలిసి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధుయాష్కి గౌడ్ వెంట ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న, పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు
- Advertisement -