: ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్
వివేకానంద పార్కులో మార్కింగ్ వాక్ చేసిన మధుయాష్కి గౌడ్
వనస్థలిపురం, వాయిస్ టుడే:
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ప్రచారంలో వేగాన్ని పెంచారు. శనివారం ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద పార్కులో వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వస్తున్నారని ఆరోపించారు. స్థానికుడినైన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కార్పోరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, కాటం పార్వతమ్మ ఎన్ క్లేవ్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు నేనావత్ జానకిరామ్ నాయక్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వివేకానంద పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగు వెంకటేష్ గౌడ్, జెల్ల రమేష్ గౌడ్, జూలూరి మహేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ పాల్గొన్నారు.