తెదేపా, జనసేన అధిస్టానంపై నేతలె, కార్యకర్తల మండిపాటు
తిరుపతి
తిరుపతిలో ఇప్పటివరకు తెదేపా పార్టీ నాయకులు తమ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, కేసులు పెట్టుకున్నామని పార్టీ టికెట్ తమతోనే ఏ ఒక్కరికీ ఇచ్చిన కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. జనసేనా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటికి ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్తు పార్టీల కోసం పనిచేస్తున్నారు.
తెదేపా అధిష్టానం తిరుపతి అభ్యర్థిగా బిసి కులానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని అనుకోవడంతొ బలిజ కులంకు చెందిన జే.బి.శ్రీనివాస్ పేరు ముందుకొచ్చింది. అయనను తేదేపా అధినేత చంద్రబాబు పిలిపించి సంప్రదింపులు కూడా చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్ళే నాయకుడని, అన్ని కుల వర్గాల వారిని కలుపుకుపోతారని చంద్రబాబు దృష్టికి సీనియర్ నేతలు తీసుకెళ్లారు. అనంతరం బాబు చేయించిన సర్వెలో కూడా వచ్చింది. తరువాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, రెడ్డి వర్గానికి చెందిన మబ్బు దేవనారాయణ రెడ్డి, యాదవ్ కులానికి చెందిన నరసింహ యాదవ్ ఒక్కొక్కరు అధిష్టానాన్ని కలిశారు.
గురువారం నాడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 34 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించటంతో అందులో తిరుపతి అభ్యర్థి పేరు లేకపోవడం స్థానిక నాయకులను కలవరపరిచింది. అనంతరం జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున అభ్యర్థి కావాలని తెదేపా అధినేత చంద్రబాబును కోరడంతో వైకాపా పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణీ శ్రీనివాసులు జనసేనా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతిలోని స్థానిక జనసేనా నాయకులకు, అటు తెదేపా నాయకులకు టికెట్ కరారు చేయకుండా, చిత్తురు స్థానిక వ్యక్తి ఆరణి శ్రీనివాసులు పేరు తిరుపతి అభ్యర్థిగా జనసేనా అధినేత పవన్ కళ్యాణ్
ప్రకటించటంతో తిరుపతి పట్టణంలోని తెదేపా, జనసేనా పార్టీల నాయకులు,కార్యకర్తలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులకు కాకుండా లోకల్ గా ఉన్న ఇరు పార్టీలలో ఎవరికి టికెట్ ఇచ్చిన పనిచేస్తామని, లేనిపక్షంలో పూర్తిగా వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు..
తెదేపా, జనసేన అధిస్టానంపై నేతలె, కార్యకర్తల మండిపాటు

- Advertisement -
- Advertisement -