- Advertisement -
మార్కెట్ కమిటీ ఛైర్మన్ ,వైస్ చైర్మన్ లను సత్కరించిన రైతు సంఘాల నేతలు
Leaders of Farmers Associations honored Chairman&Vice Chairman of Market Committeeఖమ్మం :
నూతనంగా భాద్యతలు చేపట్టిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా యరగర్ల హనుమంత రావు,వైస్ చైర్మన్ గా తల్లాడ రమేష్ లను మార్కెట్ చైర్మన్ ఛాంబర్ లో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల వెంకటేశ్వర రావు,
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (సిపిఐ)జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మీరా, యంగల ఆనంద్ రావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు,రైతు సంఘాల నాయకులు శాలవాతో సత్కరించి అభినందనలు తెలియజే శారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు పాలక వర్గం పూర్తిగా రైతుల పక్షాన నిలబడాలని అలాగే మార్కెట్ లో రైతులకు మోసానికి గురి కాకుండ చూడాలి అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు
- Advertisement -




