సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మున్నూరు కాపు సంఘం నాయకులు.. —–మున్నూరు కాపు సంఘం విద్యార్థి వసతి గృహం నిర్మాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి.
కరీంనగర్ మార్చ్ 26(వాయిస్ టుడే )కరీంనగర్:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో కలిశారు.ఈ సందర్బంగా మున్నూరు కాపుల సమస్యల పరిష్కారం కోసం,కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ట్రస్టు భవన నిర్మాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్,టిపిసిసి జనరల్ సెక్రెటరీ సత్తు మల్లేష్ పటేల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డిని కలిసి దరఖాస్తు అందజేసినట్లు చెప్పారు.సమస్యలు విన్న సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.ప్రత్యేక నిధులు మంజూరు చేసి మున్నూరు కాపు సంఘం వసతి గృహాల భవన నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ పటేల్,మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఈసీ మెంబర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోఆర్డినేటర్ వాసాల రాజు పటేల్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం జాయింట్ సెక్రెటరీ వాసాల వెంకటేశ్వర్లు పటేల్, హఫీజ్పేట్ మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు మంగళారపు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి వాసాల శ్రీనివాస్ పటేల్, కృష్ణనగర్ మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వాసాల తిరుపతి పటేల్, మూర్తి శ్రీనివాస్ పటేల్, కరీంనగర్ మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ బోర్డు మెంబర్లు బొమ్మ పవన్ కుమార్పటేల్, వాసాల హరీష్ పటేల్, మడం శివకాంత్ పటేల్, కర్ర రాజశేఖర్ పటేల్,చింతల కిషన్ పటేల్,మహిపాల్ పటేల్, కోల అన్నారెడ్డిపటేల్,కుల సోదరులు తదితరులు ఉన్నారు.