Sunday, March 30, 2025

వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య

- Advertisement -

వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య

Leaders problem for YSRCP

నెల్లూరు,సెప్టెంబర్ 16, (వాయిస్ టుడే)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, రోజాలతో పాటు యాంకర్ శ్యామలను నియమించారు. ఈ నియామకాలు చూసి వైసీపీ నేతల్లో చాలా మంది ఆశ్చర్యం వేసింది. పెద్ద నోరున్న కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సహా ఎంతో మంది నేతల్ని కాదని రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి చాన్సివ్వడం వెనుక ఏ కారణాలు ఉన్నాయో చాలా మందికి అర్థం కాలేదు. ఇక యాంకర్ శ్యామల పార్టీ తరపున మాట్లాడితే సీరియస్ గా తీసుకునేవాళ్లు ఎవరు ఉంటారని.. ఆమెకు మరో బాధ్యత ఇచ్చినా బాగుండేదన్న వాదన కూడా ఉంది. ఇక రోజాను ఒప్పించడానికి నగరిలో ఆమె చెప్పిన వారందర్నీ పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చింది. అంటే వీళ్లను ఒప్పించడానికి కూడా వైసీపీ హైకమాండ్ ఎంతో కష్టపడిందన్న మాట. ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఉంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల్లో కనిపస్తున్న నేతలే కరవయ్యారు. దీంతో  మందు జిల్లాల పార్టీ సారధుల్ని మార్చుకుని.. ఉన్న వారిని యాక్టివ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు  పెద్దిరెడ్డి ని ఖరారు చేశారు. ఆయన ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితమేకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మళ్లీ ఇప్పుడు అదే పదవి అంటే ఆయన ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో తెలియదు కానీ.. ఆయనను ఒప్పించడానికి కూడా తంటాలు పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక నెల్లూరు .. కర్నూలు.. అనంతపురంసహా అన్నిజిల్లాల్లోనూ నాయకత్వ సమస్య ఉంది. కాస్త ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్లను నియమించాలని జగన్ అనుకుంటున్నారు. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిలో సగంమందికిపైగా నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. నియోజకవర్గాలు మారిన వారు.. తమకు  పాత నియోజకవర్గాలలే కావాలని అంటున్నారు. పోటీ చేసిన నియోజకవర్గాల్లో పని చేయడం లేదు. ఆ విషయంలో జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. ఒక్క జోగి రమేష్ కు మాత్రం మళ్లీ మైలవరం బాధ్యతలు ఇచ్చారు. మిగతా వారు తమ విషయంలో మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఏమీ సమాధానం రాకపోవడంతో పని చేసుకునేవారు కూడా కరవయ్యారు. అంతే కాదు.. అనేక మంది నేతలు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు గా  మాట్లాడిన వాళ్లు, తిట్లు తిట్టిన వారు భయంతో  దూరంగా ఉంటున్నారు.మరోవైపు వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా ఇతర పార్టీల వైపు వెళ్తోంది. జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్తే పట్టు మని రెండు వందల మందిని కూడా జన సమీకరణ చేయలేకపోయారని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు వైసీపీ క్యాడర్ అంతా కూటమి పార్టీల్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడ చేరిపోదామనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుుడు వ్యవహరించిన విధానంతో తాము ఎక్కడ ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ అవుతామో అన్న భయంతోనే ఎక్కువ మంది పార్టీకి  దూరమవుతున్నారు. అందుకే పార్టీని గాడిలో పెట్టుకోవాలంటే జగన్ చాలా కష్టపడాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్