అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజనలా!
చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్
కృష్ణా జిల్లా, జనవరి 5
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వ్ పదవులను కూడా ఇస్తూ… బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే…. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా అని నిలదీశారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజనలా!
- Advertisement -
- Advertisement -