- Advertisement -
వామపక్షాల నిరసన ర్యాలీ
Leftist protest rally
విశాఖపట్నం
రాష్ట్రంలో కూటమిప్రతం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వచ్చిన ప్రధాని మోడీ, ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా మోసగించారని, మోడీ ఒక దేశద్రోహి అని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు.విశాఖ సాక్షిగా మోదీ మరోసారి ద్రోహం చేశారని మండి పడ్డారు.ఈ మేరకు విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద వామపక్షా నాయకులు నిరసనకు దిగారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ,సొంత ముడి ఇనుప గనులు కేటాయింపు, కాపిటల్ రీ స్ట్రచ్చరింగ్ క్రింద 18 వేల కోట్లు పై ప్రధాని ప్రకటన చేయక పోవటం విశాఖకు, ఉత్త రాంధ్రకు మరో సారి ద్రోహం చేయడమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కి అవసరమైన ముడి ఇనుప గనుల సరఫరా, ఇతర అనుమతులు గురించి సాగిల పడి మాట్లాడటం విశాఖ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేయడమేనన్నారు. కేంద్ర బిజెపి,రాష్ట్ర టిడిపి, జనసేన కూటమి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిట్టల్ కి బలిచ్చేలా కుట్ర పన్నినట్టు ఈ రోజు మోడీ బహిరంగ సభతో తేలిపోయిందన్నారు. దీనికి టిడిపి, జనసేన కూటమి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
- Advertisement -