న్యాయవాది సుబ్బిరామిరెడ్డి పై దౌర్జన్యం చేసిన సీఐ ని సస్పెండ్ చేయాలి
నంద్యాల టూ టౌన్ సీఐ రాజారెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…
ఆళ్లగడ్డ తాలూకా న్యాయవాదుల సంఘం డిమాండ్
ఆళ్లగడ్డ కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఆళ్లగడ్డ
Legal action should be taken against Two Town CI
ఆళ్లగడ్డ కు చెందిన ప్రముఖ న్యాయవాది పత్తి సుబ్బరామిరెడ్డిపై నంద్యాల టూ టౌన్ సీఐ రాజారెడ్డి దౌర్జన్యం చేయడాన్ని ఆళ్లగడ్డ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో న్యాయవాది పి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని విశ్వ నగర్ లో ఉన్న తమ మూడు సెంట్ల స్థలంలో ఈనెల రెండో తేదీ సిమెంట్ పిల్లర్లు వేసేందుకు వెళ్లిన తనపై టూ టౌన్ సీఐ రాజారెడ్డి పనిని వెంటనే ఆపాలంటూ హుకూం జారీ చేశారన్నారు. పనులు ఎందుకు ఆపాలని కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా అని ప్రశ్నించిన తనపై సీఐ రాజారెడ్డి జులం ప్రదర్శించి తనను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లి గంట పాటు స్టేషన్లో నిర్భందించడం జరిగిందని అనంతరం తమ తోటి న్యాయవాదులు అక్కడికి రావడంతో వదిలి వేయడం జరిగిందన్నారు. నంద్యాలలోని
విశ్వ నగర్ లోని తమ అత్త పోరుమామిళ్ల పార్వతమ్మ కు మూడు సెంట్లు స్థలం ఉందని అది తన కొడుకు సుమంత్, బావమరిది చంద్రశేఖర్ పేరిట రిజిస్ట్రేషన్ ఉందని న్యాయవాది సుబ్బరామిరెడ్డి తెలిపారు.
కాగా ఈ స్థలంపై కన్నేసి.. వివాదం చేస్తున్న బేకర్స్ పార్క్ యజమాని చవ్వా మనోహర్ రెడ్డి శరభారెడ్డి అనే వ్యక్తుల ప్రోత్సాహంతో సిఐ రాజారెడ్డి దౌర్జన్యంగా తన స్థలంలోకి ప్రవేశించి పనులను ఆపించడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. సిఐ రాజారెడ్డి, కానిస్టేబుల్స్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుబ్బరామిరెడ్డి,సహచర న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ఆళ్లగడ్డ న్యాయ వాదులు బి.నీలకంఠశ్వరం,పి.ఎస్.మహబూబ్ బాషా, బి.శివప్రసాద్ రావు , ఎస్. రమణయ్య, బి.వి సుబ్బారెడ్డి, మురళీధర్ గౌడ్, పి. మురళి , రమాదేవి , మాజీ ఎజీపి షడ్రక్ ,బత్తలురు మల్లికార్జున రెడ్డి, పడకండ్ల మల్లికార్జున రెడ్డి, విజయ్ బాబు, సుదర్శన్, వెంకటేశ్వర్లు,జి. గణేష్, జయచంద్ర రెడ్డి, వెంకటయ్య, రమణ రావు, జి. శ్రీనివాసులు , జి. తిరుపేలు రెడ్డి, గురివి రెడ్డి, పామిలేటి, ఇమ్రాన్, పి. సుబ్బయ్య, ఎం. మోహన్ , రవి, వి.శ్రీనివాసులు, ఓబులేసు,బాబా పకృద్దిన్ , దదాపీర్ , షాహీనా బేగం, సరిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.