‘లెనిన్’ ఇదొక గొప్ప సినిమా అవుతుంది – నాగార్జున అక్కినేని
‘Lenin’ will be a great movie – Akkineni Nagarjuna
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘‘నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా ఉంటాయి. నందు తన సొంతూరు శ్రీరామపురంకి అఖిల్‌ను తీసుకు వెళ్లాడు. నందు ఇంట్లో అఖిల్‌ను సొంత బిడ్డలా చూసుకున్నారు. ‘లెనిన్’ కథలో ఉండే పెయిన్‌ని అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. ప్రతీ సినిమాకి ఒకేలా కష్టపడతారంతా. అఖిల్‌లోని పెయిన్, ఈ కథలోని పెయిన్‌కి సింక్ కుదిరింది. నేను నిర్మాతగా ఇందులోకి వచ్చాను కాబట్టి కథ విషయంలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ టైంలో పుటేజ్ చూపించారు. ఇదొక గొప్ప సినిమా అవుతుందని అప్పుడే అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతి పాత్ర (భాగ్యశ్రీ) ఈ సినిమాకి సోల్, హార్ట్ బీట్. ఎన్నో పాత్రలు, ఎన్నో లేయర్స్‌ని పెట్టి నందు గొప్ప కథను రాసుకున్నారు. వాటికి తగ్గట్టుగా తమన్ అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం చిత్రాన్ని చేయలేదు. అందుకే మేం సంతృప్తి అయ్యే వరకు ఆగాం. జూన్‌లోనే మా మూవీ రెడీగా ఉంది. ఇంకో రెండు వారాల టైం ఇవ్వండని టెక్నీషియన్లు అడిగారు. దాని వల్ల సినిమా ఇంకా ఎఫెక్టివ్‌గా వచ్చింది. నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి చేసిన చివరి చిత్రం ‘మనం’. అది నాన్న గారి కోసం చేశాను. ఇప్పుడు నా కొడుకు కోసం ‘లెనిన్’ చేశాను. ఏ తండ్రి అయినా కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు, కొడుకు సక్సెస్ అయితే తండ్రి సంతోషిస్తాడు. ప్రేమతో, ఇష్టంతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియెన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ మూవీతో కొత్త అఖిల్‌ను చూడబోతోన్నారు. ఎమోషనల్ సీన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో అఖిల్ కొత్తగా కనిపిస్తాడు. సినిమా చూసిన కాన్ఫిడెన్స్‌తోనే చెప్తున్నా.. జూలై 10న వస్తున్నాం.. కొడుతున్నాం.. మనోడు కొడుతున్నాడు’ అని అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘మన మూలాలకు, తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ‘లెనిన్’ కథ ఉంటుంది. ‘లెనిన్’ను కమర్షియల్ లెక్కల్లోంచి చూడలేదు. ఈ స్క్రిప్ట్‌ని నేను ఎక్కువగా గౌరవించాను. మేం నిజాయితీగా కష్టపడ్డాం. కథ విన్న వెంటనే సినిమాని ఒప్పుకున్నాను. ఇలాంటి ఓ గొప్ప కథను చెప్పాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. ‘లెనిన్’ను నిజాయితీగా చేశాం. లెనిన్ పాత్రలోకి వెళ్లేందుకు నేను కష్టపడ్డాల్సి వచ్చింది. ఇందులో వయలెన్స్‌కి కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. నందు గారు ఆర్గానిక్‌గా కథను రాశారు. మా కంటెంట్ మాట్లాడుతుంది. మా సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నేను, నందు కొత్త వారిలానే కలిసి ఈ మూవీకి పని చేశాం. జూలై 10న మా చిత్రంలోని ట్విస్టులు అన్నీ తెలుస్తాయ’ని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ సినిమాలో అఖిల్ కొత్తగా, ఇది వరకెన్నడూ కనిపించనట్టుగా కనిపిస్తారు. అదే మా మూవీకి ప్లస్ పాయింట్. జూలై 10న వస్తున్నాం.. కొడుతున్నాం అని నాగార్జున గారు చెప్పినట్టే జరుగుతుంది. మంచి చిత్రం చేశామని గర్వంగా చెప్పగలను. అఖిల్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. భాగ్యశ్రీ గారు అద్భుతంగా నటించారు. వీళ్లిద్దరి కోసమే కథను రాశారా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మేం మాట్లాడేకంటే.. జూలై 10న మా సినిమా మాట్లాడుతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్లీ మాట్లాడుకుందామ’ని అన్నారు.
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ .. ‘‘అఖిల్ గారికి కథ చెప్పిన వెంటనే నచ్చిందని అన్నారు. మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను, చేస్తాను అని అఖిల్ అండగా నిల్చున్నారు. నాకు అవసరం వస్తే.. రాత్రి రెండు గంటలకు అఖిల్ ఫోన్ చేసి భరోసానిచ్చారు. ఏం కావాలన్నా మేం చేస్తామని మాటిచ్చారు. అది అక్కినేని కుటుంబం మంచితనం. ‘నువ్వొస్తావని’ టైంలో ఫ్యాన్ వార్ చేశాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాను అంటే నేను ఎంతో సాధించినట్టే. మనం చెప్పిందంతా నాగార్జున గారు వింటారు. కానీ ఆయన చివర్లో సలహాలు ఇస్తారు. వాటిని పాటిస్తే సక్సెస్ వస్తుంది. మేం మంచి మూవీని చేశాం. ఫస్ట్ టైం అఖిల్ గారు ఇలాంటి ఓ విలేజ్ కుర్రాడి పాత్రను పోషించారు. ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు అఖిల్ గారు కాకుండా లెనిన్ పాత్రే కనిపిస్తుంది. భాగ్యశ్రీ డైరెక్టర్ యాక్ట్రెస్. తమన్ గారు మాకు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. పాటలు, ఆర్ఆర్ అదిరిపోతుంది. నవీన్ నూలి నిన్నటి వరకు కూడా సినిమా మీద పని చేశారు. నాగార్జున గారి ఇన్ పుట్స్ ఎన్నో వాడుకున్నాను. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ .. ‘అఖిల్‌ది, నాది కేవలం సినిమా బంధం మాత్రమే కాదు. బయటకు కనిపించేంత సాఫ్ట్ కాదు (నవ్వుతూ). బాల్ కొడితే స్టేడియం బయట ఉన్న కార్ల అద్దాలు పగులుతుంటాయి. అఖిల్ గుండెల్లో ల్యాండ్ మైన్ ఉంటుంది. సీసీఎల్ ద్వారా అఖిల్ గురించి నాకు పూర్తిగా తెలిసింది. ఏ విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడు. ఎంతో ఓర్పుగా ఉంటాడు. ‘లెనిన్’ కోసం పని చేయడం ఆనందంగా ఉంది. అన్నపూర్ణ బ్యానర్‌తో మాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగార్జున గారి ఇన్ పుట్స్ అన్నీ మేం తీసుకున్నాం. భాగ్యశ్రీ గారు స్క్రీన్ పై కనిపించిన ప్రతీ సారి ఓ ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. మా అందరినీ నమ్మిన నాగవంశీ గారికి థాంక్స్. జూలై 10న అఖిల్ కెరీర్లో ‘లెనిన్’ ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్‌లా ఉంటుంది’ అని అన్నారు.
హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ.. ‘‘నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఇలాంటి మంచి ఇండస్ట్రీలో మంచి పాత్రలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు థాంక్స్. భారతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. నందు సార్ గారు మంచి కథను రాశారు. ఇలాంటి ఓ గొప్ప పాత్రను నాకు ఇచ్చిన నందు గారికి థాంక్స్. నాలోనూ భారతి ఉందని నాకు అనిపిస్తుంటుంది. ఎవరికి ఏ పాత్ర దక్కాలన్నది ముందే రాసి ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాగార్జున గారు, అఖిల్ గారు, నాగవంశీ గారు ఎంతో సపోర్ట్ చేశారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు




