Sunday, April 6, 2025

అశ్లీలతకు తావు లేకుండా చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

అశ్లీలతకు తావు లేకుండా చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
– ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Lets Celebrate Chavithi festivals in Dignified manner- MLA Bolishetti Srinivas
తాడేపల్లిగూడెం,
అశ్లీలతకు తావు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత నియోజవర్గంలోని టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులకు, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు నిబంధనలు ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, వినాయక చవితి ఉత్సవాలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలన్నారు. భక్తి పూర్వకమైన కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. పోలీస్ సిబ్బంది వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలిగించరన్నారు. వినాయకుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే, విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్