- Advertisement -
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం.
Let's celebrate the New Year with joy.
జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రోజున విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి
జిల్లా ప్రజలు సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 రోజున జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని,నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని,అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజే లు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -