Saturday, March 21, 2026

నువ్వో నేనో తేల్చుకుందాం రా

- Advertisement -
నీ ఇంటికి వచ్చా నీ గల్లీ కొచ్చా నువ్వో నేనో తేల్చుకుందాం రా: అరికెపూడి గాంధీ సవాల్*

Let’s decide, you or me

హైదరాబాద్:సెప్టెంబర్ 12
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో ఈరోజు ఉదయం చేరుకున్నారు.

సవాళ్లు ప్రతిసవాళ్లతో పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. ఈరోజు ఉదయం 11గంట లకు అరికపూడి గాంధీ ఇంటికివెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు.

దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లేదారుల్లో బారికేడ్లతో పాటు.. భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.మరోవైపు కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయింద న్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని, లేదంటే మధ్యాహ్నం 12గంటలకు నేను ఆయన నివాసానికి వెళ్తానంటూ గాంధీ అన్నారు. ఇద్దరి దమ్మేంటో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేశారు.

నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ను, అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. అభివృద్ధి పనులకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతానని అరికెపూడి గాంధీ అన్నారు.సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో..

హైదరాబాద్ లోని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. పెద్దె త్తున పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేసినట్లు తెలుస్తోంది. ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్