కోడుమూరు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకుందాం
గూడూరు
గూడూరు మండలం ఆర్ ఖానాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిములపు సతీష్ గారికి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య గారికి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు..
ప్రచారానికి విచ్చేసిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు.. జగనన్న అందించిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో చిన్నపిల్లల నుండి ముసలిదాకా అందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు.. అలాగే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలో మౌళికవసతుకు ఏర్పాటు చేసి వైద్యాన్ని , విద్యని పల్లెలకు చేరువ చేసారని గుర్తు చేశారు.. కుల,మత,వర్గ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించటంలో సఫలమై నేడు ఓట్లు అడగడానికి వచ్చామని అన్నారు.. జగనన్న సహకారంతో కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తామన్నారు.