Saturday, April 18, 2026

హుస్నాబాద్ గడ్డ మీద కాషాయ జెండాను ఎగురవేద్దాం

- Advertisement -

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం 

హుస్నాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

హుస్నాబాద్, నవంబర్ 10 (వాయిస్ టుడే ): హుస్నాబాద్ లో  కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త ఓ బండి సంజయ్, ఈటెల రాజేందర్ కావాలని హుస్నాబాద్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్ధి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. హుస్నాబాద్ బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి శుక్రవారం హుస్నాబాద్ ఐఓసి కార్యాలయంలో నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బెన్  షాలోమ్ కు అందజేసారు. ఆనంతరం పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హస్నాబాద్ అంతా కాషాయమయం అవ్వడంతో ప్రతిపక్షాలు బెంబెలెత్తిపోతున్నాయి . ఆనంతరం బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ టికెట్ జె.ఎస్.ఆర్., మంజులా రెడ్డి, రాంగోపాల్ రెడ్డిలో ఏవరికచ్చినా కలిసి పని చేస్తామని పలు మీటింగ్లో చెప్పినమని ఇవ్వాళ అదే మాట మీద మీ అందరికి నిరూపించడానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏ విధంగా చిత్తశుద్ధితో పని చేస్తాడో ఇదొక్క నిదర్శనమన్నారు. గ్రామ గ్రామాన మీ ఇంటికి వస్తాను అన్నారు. హుస్నాబాద్ కు గత 20 ఏండ్ల నుండి ఇక్కడికి వస్తున్నాను అన్నారు. ఒకప్పుడు మాతండ్రికి సహాయకుడిగా  ఇప్పుడు మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు హుస్నాబాద్లో జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. గత ఎమ్మెల్యేకు అప్పటి ముఖ్యమంత్రి ప్రవీణ్ రెడ్డికి జేబులో దోస్తు అని చెబుతుండేవారు అన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు ఎప్పుడొచ్చిన ఇంటికి వచ్చి భోజనం చేసివేళ్ళే ముఖ్యమంత్రి మీ ఆత్మీయుడు మీకు ఈ ప్రాంతం పట్ల ఎందుకింత వివక్ష అన్నారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. గ్రామ గ్రామాన మౌళిక వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పదేండ్ల నుంచి బతిమాలాడుతున్నం ఈ ప్రాంతంను సిద్ధిపేటలో కలపకండి ఇది కరీంనగర్ లోనే  ఉంచండి అంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసామని ఆయన గుర్తు చేసారు. సిద్దిపేట వద్దు అన్న వినకుండా ఎమ్మెల్యే సతీశ్ సిద్దిపేటలో ఎవరి లాభం కోసం ఈ ప్రాంతాన్ని కలిపారని ఆయన ప్రశ్నించారు.

Let's hoist the saffron flag on Husnabad soil
Let’s hoist the saffron flag on Husnabad soil

గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అలానే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్దంలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి ప్రజలను మోసం చేసారన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు చేతకాకపోతే మంత్రి హరీశ్ రావు దత్తత తీసుకొని సతీశేబాబు దగ్గర కూర్చోని అభివృద్ధి చేస్తా అని ప్రజలకు మాయమాటలు చెప్పారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు ప్రజలు వెళితే అక్కడ ఎలా అభివృద్ధి చెందింది మన హుస్నాబాద్ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. నక్కకు నాగలోకం కు ఉన్న తేడా ఉందన్నారు. హుస్నాబాద్ ప్రాంతం పై ఎందుకింత వివక్ష అన్నారు. మూడోసారి బీఆర్ఎస్కు అవకాశమిస్తే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశాన్ని ఎలా ప్రక్షాళన చేస్తున్నాడో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. దేశం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబంకు సంబంధించిన నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతుంటే  మనం ప్రశ్నించొద్దా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడికి కొత్తగా వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒకటేపూట ముందు వచ్చి ఇప్పుడే ఇల్లు తీసుకున్నాడు.. ఇప్పుడే వకాలత్ చేస్తుండు.. ఇప్పుడే పూజలు చేస్తుండ … అంటే ఇది నమ్మేటట్టు ఉంటదా అన్నారు. నేను 20 ఏండ్ల నుండి, నా తండ్రి 40 ఏండ్ల నుండి అధికారం ఉన్న, లేకున్నా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉన్నమా లేదా అనేది గుండేమీద చేయి వేసుకొని ప్రశ్నించుకొండి అన్నారు. ఏనాడు కూడా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలి మభ్య పెట్టాలి కేవలం ఎలక్షన్ల కోసం ఒక వారం ముందు వచ్చేసి ఇక్కడ టెంట్ గూడరం వేసుకొని ఉంటే ప్రజలు నమ్ముతారా అన్నారు. ఆ ఊరు కాకపోతే ఈ ఊరు అన్నట్టు ఉంది ఆయన తత్వం అన్నారు . ఆయనకు కరీంనగర్లో చోటు లేక మీరు ఎందుకు హుస్నాబాద్ ప్రజలని మభ్యపెట్టేందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇవ్వాళ చాలా బాధ అనిపిస్తుందన్నారు. ఇక్కడ ఎందరో ఎమ్మెల్యేలుగా చేసారు కానీ ఏ ఒక్కసారి కూడా కులాల మధ్యన చిచ్చుపెట్టిన దాఖాలాలు లేవన్నారు. కులాలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ ఈ ప్రాంతాన్ని గుండెకు హత్తుకున్న వ్యక్తిగా సూటిగా అడుగుతున్నానని అన్నారు. పార్టీల సిద్ధాంతం పరంగా పార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు పట్ల ముందుకు వెళ్లాలి కానీ కులాలను పట్టుకొని ముందుకు పోవద్దు అన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయం ఏ విధంగా విషపూరితం అవుతుందో ప్రజలు గమనించాలన్నారు.

Let's hoist the saffron flag on Husnabad soil
Let’s hoist the saffron flag on Husnabad soil

అవన్నీ తిప్పికొట్టే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వందకు వంద శాతం అమ్ముడుపోతారు అన్నారు. అమ్ముడుపోకుండా మిగిలేది బిజేపీ పార్టీ అభ్యర్థినేనని ఆయన తెలిపారు. హుస్నాబాద్లో కాషాయజెండా రెపరెపలాడుతుందన్నారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం లో బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటూ ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారని ఆయన గుర్తు చేసారు. మోదీకి తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఒక పార్టీ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, మరో పార్టీ మరోక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనే అని ఆయన స్పష్టం చేసారు. ఆ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే మా ముఖ్యమంత్రి కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారినే  సియం చేస్తామని చెప్పాలన్నారు. ఏవరికి చెప్పే పరిస్థితి లేదు అంత ధైర్యం ఏ పార్టీకి లేదన్నారు. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనే సాధ్యమన్నారు. స్థానికంగా బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో హుస్నాబాద్ గడ్డ పై కాషాయ జెండాను ఎగురవేద్దామన్నారు. ఈ ప్రాంతంలో విద్య కోసం ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలను ఎందుకు తీసుకురాలేదో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ఈ ప్రాంతంకు చెందినవాడు కాదు కాబట్టే అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, ఐటిఐ కళాశాలలను తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్