- Advertisement -
మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం
Let's plant trees and save the environmentనందవరం
మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకై మనమందరం కృషి చేద్దామని ప్రిన్సిపల్ శైలజ అన్నారు.నందవరం కస్తూరిబా స్కూల్ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో మంగళవారం రోజున అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శైలజ చేపట్టారు.స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శైలజ మాట్లాడారు.మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకై మనమందరం కృషి చేద్దామని విద్యార్థినీలకు,ఉపాధ్యాయినీలకు ,సిబ్బందికి సూచించారు.ప్రతిరోజు మొక్కలకు నీరు అందించి వాటిని రక్షించాలన్నారు.మనమందరము కలిసి మొక్కలను పెంచి స్కూల్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉంచాలన్నారు.నువ్వు పెంచే ఈ మొక్క స్కూలుకు రాబోయే మీ చెల్లెమ్మలకు నీడని,ఆరోగ్యాన్ని అందించాలని విద్యార్థినీలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సి.భీమన్న,ఎ పివో శ్రీనివాసులు,టి ఎ సువర్ణ లత,ఫీల్డ్ అసిస్టెంట్ శివ,విద్యార్థినీలు పాల్గొన్నారు.
- Advertisement -




