ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయండి.
Lets success the Employees meeting
— ఉద్యోగ మహాసభ కన్వీనర్ విల్సన్ పాల్.
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పు గోదావరి జిల్లా శాఖ తరపున ఈ నెల 14వ తేదీన రాజమండ్రి జెఎన్ రోడ్ లో గల జెకె గార్డెన్స్ నందు 3వేల మంది ఉద్యోగులతో తలపెట్టిన మహాసభకు తూర్పు గోదావరి జిల్లా ఉద్యోగులు అందరూ హాజరు కావాలని ఉద్యోగ మహాసభ కన్వీనర్ సిహెచ్ఎస్ విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి కందుల దుర్గేష్, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, రుడా చైర్మన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ తదితర జిల్లా అధికారులు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారని తెలిపారు. 56 శాఖల కలయికతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ, ప్రధానకార్యదర్శి ఎం రమేష్ కుమార్, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. గత కొంతకాలంగా ఉద్యోగుల సమస్యలు పేరుకుపోయి అపరిష్కృతంగా ఉన్నాయని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించడమే ఈ మహాసభ ముఖ్య ఉద్దేశ్యమని విల్సన్ పాల్ తెలిపారు .