సమన్వయంతో కలిసి పనిచేద్దాం: ఇ. వి. డి. యం కమిషనర్ రంగనాథ్
వర్షాకాలం వేళ ఇ. వి. డి. యం విభాగం మరియు పోలీసులు సమన్వయంతో పని చేసి నగరంలో వర్షం నిలువకుండా తగు చర్యలు తీసుకుందామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ తెలిపారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో వర్షంనీరు రోడ్లపై నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్త పడేందుకు ఇ. వి. డి. యం కమిషనర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ తో పాటు ట్రై కమిషనరెట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ )పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా అధిక వర్షపాతం నమోదైనప్పుడు అక్రమణలకు గురైన ప్రాంతాలలో పాటు, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలువ కుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెట్టే విధంగా ఫుట్ పాట్ లపై ఆక్రమణ చేసి వ్యాపారాలు నిర్వహించుకునే వారిని తొలగించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించడంతో పాటు ట్రాఫిక్ అధికారులు తమ పరిధిలోని ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి వరద నీటి త్వరగా తరలించే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ అధికారులకు తెలియజేసారు.



