ప్రాణం తీసిన ఈత సరదా
నీటిలో మునిగిపోయి యువకుడి దుర్మరణం
మే.14
వాయిస్ టుడే మహబూబ్నగర్ జిల్లా
,నవాబుపేట,
ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మండల పరిధిలోని యన్మన్ గండ్ల
గ్రామానికి చెందిన మంగలి హరిబాబు కుమారుడు ఆంజనేయులు ( 26 ) శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో గల
పెద్ద చెరువులో సరదాగా
ఈత కొట్టడానికి వెళ్ళాడు.
ఈత కొడుతూ నీటి మధ్యకు వెళ్ళిన ఆ యువకుడికి దమ్ము రావడంతో అతడితో పాటు ఈత కొడుతున్న యువకులు నీటిలో నుండి పైకి లాగే ప్రయత్నం చేశారు.అతడిని బయటకు లాగేందుకు వారికి కూడా శక్తి సరిపోక పోవడంతో వారందరూ చూస్తుండగానే ఆ యువకుడు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి యువకుడు శవం కోసం చెరువు నీటిలో గ్రామస్తులు ఈతగాళ్ళు వెతికి బయటకు తీయడం జరిగింది



