- Advertisement -
ప్రైవేటుకే మద్యం వ్యాపారం అప్పగింత
Liquor business is handed over to private sectorఅమరావతి
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో 3,396 దుకాణాలను నోటిఫై చేయనున్నారు. గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 (10 శాతం) నోటిఫై చేయనున్నారు. వీటన్నింటికీ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని వ్యక్తులైనా నిర్దేశిత రుసుము చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు.
- Advertisement -




