హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే): ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారంతో పాటు లిక్కర్‌ను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే దాదాపు కోటీ 42 లక్షల రూపాయలు విలువజేసే లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నిర్మల్, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో షాపుల్లో సీజ్ చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజే నిర్మల్, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఆరు లిక్కర్ షాపుల నుంచి కోటి 42 లక్షల వాల్యూ ఉన్న మద్యాన్ని సీజ్ చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిర్మల్‌లోని ఒక షాపులో 1560 లీటర్లు, నల్గొండలో గల ఒక షాపులో 1876 లీటర్లు, హైదరాబాద్ 2369 లీటర్లు, రంగారెడ్డిలో 5998 లీటర్లు, మేడ్చల్‌లో 3777 లీటర్లు సీజ్ చేసినట్లు చెప్తున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ దాదాపు ఒక కోటి 42 లక్షల విలువ ఉన్నట్టుగా ఎక్సైజ్ శాఖ తెలుపుతుంది ఒక్కరోజులోనే ఇంత పెద్ద ఎత్తున నిల్వ ఉన్న మద్యాన్ని పట్టుకోవడం చర్చనీయాంశమైంది.
ఇంకా ఎన్నికలకు 40 రోజుల్లో పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఎంతమేర లిక్కర్ పట్టుబడుతుందో అన్నది ఊహకే అందడం లేదు.2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లోనే ఎక్కువ మొత్తంలో లిక్కర్‌ను పోలీస్ శాఖ సీజ్ చేసింది.. 2018 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల 38 లక్షల 22,184 రూపాయల లిక్కర్‌ను గత ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు.. కానీ ఈసారి దాదాపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన పది రోజుల్లోనే ఇప్పటివరకు మూడు కోట్ల 60 లక్షల 57000 రూపాయలు విలువ చేసే లిక్కర్ సీజ్ చేశారు.. ఇంకా ఎన్నికలకు 40 రోజులకు పైగా ఉన్న నేపథ్యంలో ఈ సారి పట్టుబడే లిక్కు విలువ 50 కోట్లు దారుతుందని అంచనా వేస్తున్నారు.