అగష్టు 15 లోగా రుణమాఫి పూర్తి

- Advertisement -

అగష్టు 15 లోగా రుణమాఫి పూర్తి
హైదరాబాద్

Loan waiver completed by August 15

అర్హులైన రైతులకు రేషన్కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. రూ.లక్షలోపు రుణాల మొత్తం రూ.6 వేల కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా మిగతా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15నాటికి రుణమాఫీని పూర్తి చేస్తాం. ఇందుకు మొత్తం రూ.31 వేల కోట్లు జమ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. అందులో మొదటిసారి రూ.లక్ష చేస్తున్నాం. 18 తేదీన 11.50 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ అవుతుంది. రెండో దఫా ఆగస్టు 15 నాటికి మరో రూ.లక్ష బ్యాంకుల్లో జమ చేస్తాం. తెల్ల రేషన్కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి. నకిలీ పట్టా పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని గుర్తించాం. రూ.లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదు. అలాంటి వారివి 17 వేల ఖాతాలున్నాయి అని మంత్రి తుమ్మల తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular