మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు రుణాలు

- Advertisement -

మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు రుణాలు

Loans to Musi River Rehabilitation Women's Associations

17  మహిళా సంఘాలకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్
మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు ప్రభుత్వం  రుణాలు ఇచ్చింది. పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు మంత్రి సీతక్క చెక్కులు అందజేసింది. ఈ కార్యక్రమంలో  ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మోయినుద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
17 గ్రూపుల నుంచి  3 కోట్ల 44 లక్షల చెక్కులను 172 మంది మహిళలు అందుకున్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కొంత కష్టంగా వుంటుందని అన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూసీ నది వరద ఉదృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రకృతి వైపరిత్యాలు దేశంలో సంభవిస్తున్నాయి. మంచి వాతావరణంలో మనం జీవించాలి. మంచి గాలి , నీళ్లు దొరికే ప్రదేశంలో జీవనం సాగించాలి. ఒక తరం మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ఇబ్బందుల్లో నివసించారు. రేపటి తరమైన మంచి వాతావరణంలో బతికేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మహిళా గ్రూపులలో  ఒక్కో మహిళలకు 2 లక్షలు రూపాయలు రుణాలు ఇస్తున్నాం. 2 లక్షల రుణాలలో లక్షా 40  వేలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. కేవలం 60 వేలను మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలి. కుట్టు మిషన్లను సైతం మూసీ నది మహిళా సంఘాలకు ఇస్తాం. వివిధ రకాల వ్యాపారాలకి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తాం. మూసీ నది పునరావాస పొందిన వారి పిల్లలకు అన్ని రకాల విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular