ఏప్రిల్ 16ను లోక్‌సభ ఎన్నికలు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
అధికారులకు రిఫరెన్స్ కోసమే ఆ తేదీ.వివరణ ఇచ్చిన సీఈవో
న్యూ డిల్లీ జనవరి 24
ఏప్రిల్ 16ను లోక్‌సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా వైరల్‌గా మారింది. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని, ఏప్రిల్ 16ను తాత్కాలిక తేదీగా భావించి ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.ఐతే ఈ నోట్ పై ఢిల్లీ సీఈవో కార్యాలయం వివరణ ఇస్తూ అధికారులకు రిఫరెన్స్ కోసమే ఆ తేదీ అని పేర్కొంది. దీని పై స్పష్టత ఇవ్వాలంటూ జర్నలిస్టులు, మీడియా సంస్థలు ఢిల్లీ సీఈవో కార్యాలయాన్ని సంప్రదించాయి. దీంతో ఢిల్లీ సీఈవో కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్లానర్ ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు చేసుకునేందుకు జిల్లా రిటర్నింగ్ అధికారులకు రిఫరెన్స్ కోసమే ఆ తేదీని సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 11న మొదలైన లోక్‌సభ పోలింగ్, ఏడు దశల్లో సాగింది. ఆ ఏడాది మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టింది.
ఏప్రిల్ 16ను లోక్‌సభ ఎన్నికలు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
- Advertisement -
- Advertisement -